"ఇంట్లో భార్యభర్తల గొడవల్లో భార్య కత్తితో భర్తను పొడిచినంత మాత్రాన అది హత్యాయత్నం కాదు
భార్య కు విధించిన 4 సంవత్సరాల శిక్షని 500 రూపాయల జరిమానా కింద మార్చిన కోర్ట్.
దినదినాభివృద్ధి చెందుతున్న మన దేశ న్యాయవ్యవస్థ !!
రాజ్యాంగం ప్రకారం మరియు మన దేశ చట్టాల ప్రకారం మన కోర్టులు(శిఖరాలు) ఇచ్చిన కొన్ని ఆణిముత్యాల్లాంటి తీర్పులు:
👉అక్రమ సంబంధాలు నేరం కాదు.
👉సహజీవనం నేరం కాదు.
👉పెళ్ళికి ముందు శృంగారం నేరం కాదు.
👉స్వలింగ సంపర్కం నేరం కాదు.
👉స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు.
👉భావప్రకటనా స్వేచ్ఛతో కించపరచడం నేరం కాదు.
👉జాతీయగీతం పాడేటప్పుడు నిలబడకపోవడం నేరం కాదు.
👉అవినీతి పరులు ఎన్నికలలో పోటీ చెయ్యడం నేరం కాదు.
👉వ్యభిచార గృహానికి వెళ్లిన విటుణ్ని విచారించకూడదు.
👉సెక్స్ వర్కర్స్ ని అరెస్ట్ చెయ్యకూడదు.
👉డ్యాన్స్ బార్లకు అనుమతి.
👉ప్రేమికులు వేర్వేరు మతాలకు చెందినంత మాత్రాన లవ్ జిహాద్ గా చూడలేం
👉వివాహేతర సంబంధాల సంతానానికీ తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు.
👉"ఇంట్లో గోడకు ఏసు క్రీస్తు పటం ఉన్నంత మాత్రాన ఆ ఇంటివాళ్ళు క్రైస్తవులనడానికి వీలు లేదు "!
👉"ప్రేమ పెళ్లిళ్లకు అడ్డు చెప్పే అధికారం పేరెంట్స్ కు లేదు
👉 డార్లింగ్ అని పిలిచినా లైంగిక వేధింపే"
👉దావుద్ తో సంబంధం ఉన్నోళ్లంతా ఉగ్రవాదులు కాదు.
👉 600 గ్రాముల గంజాయి స్వల్పమే.
👉 ఒక మేజర్ హిందూ స్త్రీ తనకు నచ్చిన మతం మారవచ్చు కానీ సన్యాసిని గా మారకూడదు.
👉 ఒక మహిళ పురుషుడితో హోటల్ రూంకో ఓయో రూంకో వెళ్లినంత మాత్రాన ఆమె శృంగారానికి అంగీకరించినట్లు కాదు
👉 భార్య వేరొకరితో కన్న బిడ్డకూ భర్తే తండ్రి.
👉 భార్య మరో వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కాదు.
👉 వివాహేతర శృంగారం నేరం కాదు.
👉 భార్యకు ప్రియుడితో హోటల్ లో ఉండే హక్కు ఉంది.
👉 ఆట విడుపుగా పేకాట తప్పు కాదు
👉 పాకిస్తాన్ ని సమర్థిచడం క్రిమినల్ నేరం ఏమీ కాదు.
👉 అసభ్య పదజాలంతో సందేశాలు పంపడం వేధింపులు కిందకి రావు
👉 ఇస్లాం ప్రకారం మైనర్ ని పెళ్లిచేసుకోవచ్చు.
👉 వివాహిత మహిళ ఎవ్వరి ద్వారా గర్భం దాల్చినా ఆమె భర్తే బిడ్డకు తండ్రి.
👉 మహిళను చెయ్యి పట్టి లాగడం నేరమేమి కాదు
👉 మైనర్ల పై గ్యాంగ్ రేప్ కేసుల్లోని దోషులు... శిక్షల్లో ఉపశమనం కోరవచ్చు
👉 ముస్లిం పురుషుడు అందరినీ సమానం గా చూసుకుంటే బహుళ భార్యలు కలిగి ఉండవచ్చు
👉 "ఇస్లాం ప్రకారం నిఖా జరిగితే.. మైనర్ బాలికతో చేసే శృంగారం రేపు కాదు.."
👉 పోర్న్ నిషేధిస్తే నేపాల్ మాదిరి ఉద్యమం రావచ్చు
👉 భార్య ఇంకొకరితో చనువుగా ఉన్నా, వీడియో కాల్స్ చేసుకున్నా,గంటలు గంటలు కాల్స్ మాట్లాడినా భర్తకు ప్రశ్నించే అధికారం లేదు. ఒకవేళ ప్రశ్నిస్తే భర్త పై చట్ట పరమైన చర్యలు
👉 సహజీవనం లో మహిళకు భార్య హోదా ఇవ్వాలి
👉 పెళ్లి కాని వ్యక్తి ఇద్దరు ముగ్గురు మహిళలతో సంబంధం పెట్టుకుంటే తప్పేంటి
👉 భర్తని కాదని నచ్చిన వాడితో ఉండేందుకు అనుమతించిన హైకోర్టు.
👉 ఇద్దరు అవివాహిత వయోజనులు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకుంటే దాన్ని తప్పుగా చూడలేము
ఇప్పుడు తాజాగా....💦💦
👉 ఇంట్లో భార్యభర్తల గొడవల్లో భార్య కత్తితో భర్తను పొడిచినంత మాత్రాన అది హత్యాయత్నం కాదు
ధర్మ ప్రభువులు సామీ మీరంతా ?
ఎక్కడ చదువుకున్నారు సామీ ?
సమాధానం: నా స్పందన
ఇప్పుడున్న చట్టాలలోని లోపాలు, లొసుగులు ఉపయోగించుకుని నేరస్తులు చేసిన వాదనల కారణంగా కోర్టులు తప్పనిసరి పరిస్థితుల్లో అనివార్యమైన తీర్పుల సారాంశం ఇది.
కోర్టు తన ముందుంచబడిన చట్ట బద్ధమైన పత్రాలు,సాక్ష్యాలు, వాంగ్మూలాలు, ఆధారాలు, ఆయా చట్టాల నిబంధనలు ప్రాతిపదికగా తీర్పులు ఇవ్వాల్సిందేగానీ, జడ్జీలు తమ స్వంత తెలివి, ఆలోచన, తాను ఆచరించే ధర్మం, నమ్మిన సిద్ధాంతం, నీతి, నిజాయితీ అనుసరించి తీర్పులివ్వలేరు. అలా ఐతే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తీర్పులు వ్రాసుకుంటారు. అరాచకం రాజ్యమేలుతుంది. అలాంటి తీర్పులిస్తే సమాజం ఇంకా భ్రష్టుపట్టి పోతుంది.
అందుకని పైన చెప్పిన తీర్పుల అనర్థాలకు కారణం చాలావరకు చట్టంలో తప్పులు, దోషాలు, భేదాలు మాత్రమే కానీ, కోర్టులు మాత్రమే కాదు. చట్టాల్ని మార్చే అధికారం కోర్టులకు లేదు.
చట్టం వల్ల జరుగుతున్న అనర్థాలను సరిదిద్దే అవకాశం, అధికారం ప్రభుత్వానికి, చట్టసభలకు, వాటిని అధిష్టించిన రాజకీయ నాయకులకు ఉంది. చిత్తశుద్ధి తో యూనిఫాం సివిల్ కోడ్ వంటి మార్పులు ప్రవేశ పెట్టాలన్న నాయకులకు మద్ధతు లభించడం లేదు. స్వార్థం, స్వప్రయోజనం కోసం అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్న నాయకులు చట్ట సభలకు వెళ్తున్నారు. వారికి ఓట్లేసి ఆ అధికారం ఇస్తున్నది ప్రజలే... కాబట్టి వ్యవస్థని, వ్యవస్థలోని లోపాల్ని సరిచెయ్యాల్సింది ప్రజలే...
కోర్టుల చేతులు, కాళ్ళు కట్టేసి కోర్టులు సరిగా నడవడం లేదని నిందించడం పొరపాటు....
ఏ వ్యవస్థనైనా సంఘటితంగా మార్చగలిగే శక్తి ప్రజలకుంది.... కానీ పీతల గంపలాంటి మన దేశంలో, ఓట్లమ్ముకునే ప్రజాస్వామ్యంలో ఆ శక్తి నిర్వీర్యం అయిపోయింది.
దీనికి పరిష్కారం కనుచూపు మేరలో లేదు.🙏🏼
No comments:
Post a Comment